పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు - అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా శిరసా వహిస్తా : జీవన్‌రెడ్డి - MLC Jeevan Reddy Letest news
Published : Dec 4, 2023, 5:24 PM IST
|Updated : Dec 4, 2023, 5:47 PM IST
MLC Jeevan Reddy Meeting In Jagtial :ఎన్నికల్లో తాను ఓడిపోయినా జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన శిరసా వహిస్తానని, తాను ఎప్పడు పదవుల కోసం పాకులాడలేదని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల బరిలో నిలిచి ఓటమి చెందిన తర్వాత జగిత్యాలలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆస్థిర పరచటానికి ఇప్పటి నుంచే కుట్ర జరుగుతుందని, కడియం శ్రీహరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
Jeevan Reddy Comments On KCR : దీనికి కేంద్రంలో బీజేపీ కీలక పాత్ర లేకపోలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలు బయట పడాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి రావాలని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతామని తెలిపారు. తుమ్మటి హెట్టి ద్వారా ప్రాజెక్టును మార్చి నిర్మాణం చేస్తే 10 వేల కోట్లలో పూర్తి చేయవచ్చన్నారు.