MLC jeevan reddy comments: 'ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైన బీఆర్ఎస్' - జగిత్యాల జిల్లా లింగం పేటలో కాంగ్రెస్ సమావేశం
MLC Jeevan Reddy Fires on BRS party : జగిత్యాల పట్టణంలోని లింగంపేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజలతో ర్యాలీగా వెళ్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జీవన్‌రెడ్డి ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చటంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలం కావటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీకీ నలభై, యాభై నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని మంత్రి పేర్కొనటం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు కావాలనే వారిలో పోటీ అధికంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు, ఉద్యోగాలు కేవలం హామీలకే పరిమితమయ్యాయని ఆక్షేపించారు. బీఆర్స్ నియంతృత్వ దోరణితో వ్యవహిరస్తుందని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. తాము ఏ పార్టీనీ బంగాళఖాతంలో కలపాలనే ఉద్ధేశ్యంతోలేమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.