MLC Jeevan Reddy Reacts on Medigadda Issue : 'నాలుగేళ్లకే కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి' - మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదం
Published : Oct 24, 2023, 2:28 PM IST
MLC Jeevan Reddy Reacts on Medigadda Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని.. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి కేంద్ర జల మండలి నుంచి అనుమతులు లేవని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగటంపై తీవ్రంగా స్పందించారు.
MLC Jeevan Reddy fires on KCR : ప్రాజెక్టు నిర్మించిన నాలుగేళ్లకే కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 50 ఏళ్ల కింద కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, శ్రీశైలం చెక్కు చెదరలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్ ప్రకారమే.. ప్రాజెక్టును నిర్మించినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలాగా మారిందని ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎడాపెడా అప్పులు తెచ్చి.. తెలంగాణ ప్రజానీకాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. రూ.వేల కోట్లు గంగపాలు చేశారని మండిపడ్డారు.