తెలంగాణ

telangana

'ఆధారాలున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు'

ETV Bharat / videos

MLC Jeevan Reddy: 'అవినీతికి పాల్పడ్డారని మీరే చెప్పినప్పుడు చర్యలెందుకు లేవు' - telangana latest news

By

Published : Apr 28, 2023, 5:14 PM IST

MLC Jeevan Reddy Fires on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వయంగా సీఎం కేసీఆరే దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తాటికొండ రాజయ్యపై ఆరోపణలు వస్తే ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్‌.. ఇప్పుడు పూర్తి ఆధారాలున్నా ఎందుకు కాపాడుతున్నారన్నారు. అవినీతి చేస్తే అడ్డంగా నరుకుతా అన్న కేసీఆర్‌.. ఏసీబీ పరిధిలోకి వచ్చే అలాంటి వారిని పట్టించుకోవటం లేదన్నారు. దళిత బంధు ఆత్మబంధు అంటున్న కేసీఆర్‌ 2022-23లో రూ.17 వేల కోట్లు కేటాయించి ఒక్కరికైనా పథకం వర్తింపజేయలేదన్నారు. ఎస్సీలకు కేటాయించి ఖర్చు చేయని దాదాపు రూ.50 వేల కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్ట వచ్చన్నారు.

"రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న పథకం ఏదైనా ఉంది అంటే అది దళితబంధు అని చెప్పక తప్పదు. దళితబంధులో బీఆర్​ఎస్​ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కాదు. దళితబంధు కార్యక్రమానికి సంబంధించి బీఆర్​ఎస్ నాయకులు ఏ విధంగా వసూళ్లకు పాల్పడతున్నారని ఆధారాలతో నివేదికలందినప్పటికీ ఎందుకు ముఖ్యమంత్రి ఉపేక్షిస్తున్నారు. ఆధారాలు లేకుండా తాటికొండ రాజయ్యను పదవి నుంచి తొలిగించారు. ఇప్పుడు ఆధారాలున్నప్పటికీ బీఆర్​ఎస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు."జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ 

ABOUT THE AUTHOR

...view details