'బీఆర్ఎస్ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు - కాళేశ్వరం అవినీతి బయటపెడతాం' - కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన జీవన్ రెడ్డి
Published : Dec 17, 2023, 3:25 PM IST
MLC Jeevan Reddy Fires on BRS Leaders : మాజీ మంత్రి హరీశ్‌రావు పీవీ నర్సింహారావుపై ప్రేమ ఒలకపోయడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పీవీ సీఎం, ప్రధానమంత్రిగా పని చేసి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్‌లోనే చేపట్టాలని కుటుంబసభ్యులే కోరారని అన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
Jeevan Reddy Speak on Kaleshwaram Project :ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. స్వార్థ పూరిత రాజకీయాలతో భద్రాచలానికి చెందిన 7 మండలాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ తేవడంలోనూ ఫెయిలయ్యారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఇంకా తామే అధికారంలో ఉన్నామని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారన్న ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు.