MLA Vinay Bhaskar Meets Thatikonda Rajaiah : 'అధిష్ఠానానికి ఆ సిగ్నల్ అందింది.. అది చాలు నాకు' - వినయ్ భాస్కర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజయ్య
Published : Sep 5, 2023, 2:57 PM IST
MLA Vinay Bhaskar Meets Thatikonda Rajaiah : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. నియోజకవర్గ రాజకీయాల్లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవలే రాజయ్య కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగాణాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇంతలోనే రాజయ్యను.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇవాళ కలిశారు. హనుమకొండలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసి కాసేపు ముచ్చటించారు.
సోమవారం రోజున కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహతో రాజయ్య భేటీ తరువాత.. వినయ్ భాస్కర్ ఆయణ్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజయ్యను బుజ్జగించేందుకు కలిశారన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇది సాధారణ భేటీ తప్ప దీనికి రాజకీయ ప్రాధాన్యం లేదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. టీచర్స్‌డే సందర్భంగా రెండు సంఘాలు ఇద్దరిని పిలిచాయని.. అందుకే కలిశానని తెలిపారు. బీఆర్ఎస్పై రాజయ్య సంతృప్తిగానే ఉన్నారని వినయ్ భాస్కర్ అన్నారు తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ రాకపోవడం బాధగా ఉన్నా.. అందరి మద్దతు పొందుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మాదిగలు జాగృతమయ్యారన్న సంకేతం అధిష్ఠానం కూడా గుర్తించిందని తెలిపారు. తాను ప్రజా జీవితంలోనే ఉంటానని.. పునరుద్ఘాటించారు.