తెలంగాణ

telangana

MLA Sudheer Reddy Sensational Comments on Congress Govt

ETV Bharat / videos

బీఆర్ఎస్​ను వీడను, కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందనటం సరికాదు : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - MLA Sudheer Reddy Fire on BRS Senoior Leaders

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 5:50 PM IST

MLA Sudheer Reddy Sensational Comments on Congress Govt :ప్రజస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని ఎల్బీనగర్‌ ఎమ్యెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామన్నారు. ఓటమిని హుందాగా స్వీకరిద్దాం, బీఆర్ఎస్ నేతలు తొందరపడి మాట్లాడటం తగదన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీఆర్ఎస్ సర్కారు వస్తుందని కొందరు సీనియర్ నేతలు మాట్లాడటం సరికాదని అన్నారు. యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయమన్నారు.

ఈ విధానాన్ని తప్పుడుగా అన్వయించడం పద్ధతి కాదన్నారు. కేసీఆర్​ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం రాజకీయాల్లో మంచి సంప్రదాయం, అభినందనీయం కూడా దీనిని స్వాగతించాలే కానీ వక్రీకరించకూడదని పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ అగ్రహీరో చిరంజీవి కూడా పరామర్శించి రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడే ప్రయత్నం చేశారు. నేను ఇలా మాట్లాడితే పార్టీ మారతారని అని అన్వయించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తాను కేసీఅర్ సైనికుడినని, బీఆర్ఎస్​లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని తెలిపారు. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు విశ్లేషించుకొని బలంగా ముందుకొస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details