తెలంగాణ

telangana

MLA Shankar Nayak Pressmeet Today

ETV Bharat / videos

'నా పొలిటికల్​ లైఫ్​లో ఈ ఎన్నికలు ఎంతో గుణపాఠం నేర్పాయి - ప్రజల తీర్పు ఏదైనా శిరసా వహిస్తా' - మహబూబాబాద్ జిల్లా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 4:48 PM IST

MLA Shankar Nayak on Assembly Elections Results :తన పొలిటికల్ జీవితంలో ఈ ఎన్నికలు ఎంతో గుణపాఠాన్ని, రాజకీయాన్ని నేర్పాయని మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన.. డిసెంబర్ 3న ప్రజల తుది తీర్పు వెలువడనుందని.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు.

Telangana Election Results 2023 :కాంగ్రెస్, బీజేపీ వాళ్లు బాగా ఎగిరెగిరి పడుతున్నారని.. ఫలితాల రోజు వాళ్ల అసలు బాగోతం బయటపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం.. భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడిందని తెలిపారు. గతంలో జరిగిన అభివృద్ధి.. ఈ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజాసేవలో ఉంటానని.. ఈ ఎన్నికల్లో తన కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ABOUT THE AUTHOR

...view details