MLAa Seethakka : పలుగు పార చేతపట్టి.. రోడ్డు మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే సీతక్క - ఎమ్మెల్యే సీతక్క శ్రమదానం
mla-seethakka repairs damaged road :మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలోని కొత్తగూడ - పాఖాల ప్రధాన రహదారి గాలే వాగు సమీపంలో గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆ ప్రాంతానికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి.. రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంట్ కంకరతో పూడ్చి శ్రమదానం చేశారు. ప్రభుత్వం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో.. కనీసం రహదారి మరమ్మతులు కూడా చేయకపోవడం.. శోచనీయమని సీతక్క అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలపై సర్కార్ చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ చట్టాలను సవరణ చేసి అభివృద్ధి చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని వివరించారు. రోడ్డు నిర్మాణానికి మంజూరైన రూ.2.30 కోట్ల నిధులతో వెంటనే నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మార్గం మధ్యలో ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద... రైతులు చేను దున్ని విత్తనాలు వేస్తుండగా.. సీతక్క ఆగి అరక దున్ని విత్తనాలు వేశారు.