కల్యాణ లక్ష్మీ పథకానికి రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలి : సబితా ఇంద్రారెడ్డి - kalyani Lakshmi Cheques
Published : Jan 4, 2024, 6:49 PM IST
MLA Sabitha Indra Reddy about Kalyana Lakshmi :బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కొత్తగా ఇచ్చే కల్యాణ లక్ష్మి పథకానికి రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలని సూచించారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు.
Kalyana Lakshmi Cheques Distribution : మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, బడంగ్‌పేట పురపాలక సంఘాల్లో ఎన్నికల ముందు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లబ్దిదారులకు అందజేశారు. జల్పల్లి పరిధిలో 77 మందికి, బడంగ్‌పేట పురపాలక సంఘం పరిధిలో 55 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. గత ప్రభుత్వం తరహాలోనే సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయ, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికి అమలు చేయాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.