తెలంగాణ

telangana

Medak church Yearlong Centenary Celebrations

ETV Bharat / videos

మెదక్​ చర్చి శతాబ్ధి వేడుకలకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ - మెదక్​ చర్చి శతాబ్ధి వేడుకలు

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 7:12 PM IST

MLA Rohit Attended centenary celebrations of Medak Church : మెదక్​ చర్చి శతాబ్ధి వేడుకలకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు ఉంటాయని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్​ మైనంపల్లి రోహిత్ రావు చెప్పారు. సోమవారం చర్చిలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రార్థనలు చేశారు. గురువులు ఆయనకు దీవెనలు అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందేళ్ల ఘన చరిత్ర కలిగిన గొప్ప చర్చి మెదక్​లో ఉండటం విశేషమన్నారు. మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ చర్చికి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

Christmas Celebration in Medak Church: ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రార్థన చేసుకునే హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్‌‌లతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేకంగా చర్చి వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్‌‌ తాత బెలూన్‌‌ అందరినీ ఆకట్టుకుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచే ప్రాతఃకాల ఆరాధనతో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. అనంతరం కేకును కట్ చేసి శతాబ్ది ఉత్సవాల క్యాలెండర్ ఆవిష్కరించిన బిషప్ రైట్ యేసు సమస్త రక్షణ కోసమే పుట్టారన్నారు.

ABOUT THE AUTHOR

...view details