తెలంగాణ

telangana

MLA Rajaiah Burst into Tears

ETV Bharat / videos

లైంగిక ఆరోపణలు... కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య - వరంగల్ జిల్లా తాజా వార్తలు

By

Published : Mar 15, 2023, 3:47 PM IST

MLA Rajaiah Burst into Tears: రాజ‌కీయంగా తనని దెబ్బకొట్టేందుకు కొంత‌మంది లేనిపోని ఆరోప‌ణ‌ల‌ను చేయిస్తున్నార‌ంటూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటితడి పెట్టారు. కుమిలిపోతు తన బాధను చెప్పుకుంటూ కుప్పకూలిపోయీరు. రాజకీయ కుట్రతో 63 ఏళ్ల తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కరుణాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విచారం వ్యక్తం చేశారు. డైరెక్ట్​గా తనను ఎదుర్కోలేక కొందరు రాజకీయాలు చేస్తు ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యాంతమయ్యారు. 

ఫేస్ టు ఫేస్​ రాజకీయాలు చేయండి.. తాడోపేడో తెలుసుకుందామని సవాల్ విసిరారు. ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశీస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నారని ఇటీవ‌ల లైంగిక ఆరోప‌ణ‌లను ఉద్దేశించి ఆయ‌న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఆప్యాయంగా తాను మమత అనురాగాలు పంచి పెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. 

వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు.. సొంత పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు స్టేషన్​ ఘనపూర్ నియోజకవర్గమే తన  దేవాలయం, ప్రజలే తనకు దేవుళ్లని తెలిపారు. ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల మధ్యనే చస్తానని రాజయ్య వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details