MLA Rajaiah Over Perfoming Yagam for Ghanpur Ticket : భద్రకాళీ ఆలయంలో రాజయ్య యాగం.. ఘన్‌పూర్ టికెట్ తనకేనని ధీమా... - Mla Rajaiah comments
MLA Rajaiah Over Perfoming Yagam for Ghanpur Ticket : రాబోయో ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ తనకే వస్తుందంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయంలో రాజశ్యామల యాగం చేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. పార్టీ కోసమే యాగాన్ని చేపడుతున్నామన్నారు. ఈ యాగం ముఖ్య ఉద్దేశ్యం శత్రువు బలం పటాపంచలై తన విజయ మార్గం సులువు కావాలన్నారు. ప్రజల దయతో నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచానని.. రాబోయే ఎన్నికలలో కూడా గెలిపిస్తానని నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ దీవెనలతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేకు రాజీనామా చేసి గెలుపొందానని వ్యక్తం చేశారు. కేసీఆర్ అక్కడ.. రాజన్న ఇక్కడ అనే విధంగా అబివృద్ధి చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ గారు తనకే టికెట్టు ఇస్తారని పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రచారానికి కూడా వస్తారని ధీమా వ్యక్తం చేశారు.