MLA Rajaiah inaugurated CM Cup games : కబడ్డీ కూతతో.. మోత మోగించిన ఎమ్మెల్యే రాజయ్య - సీఎం కప్ 2023 గేమ్స్
MLA Rajaiah inaugurated CM Cup 2023 games in Hanmakonda : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని.. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు సీఎం కప్-2023 మండల స్థాయి క్రీడలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ క్రీడా సంబురాలలో భాగంగా సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కబడ్డీ ఆడుతుండగా డీసీపీ అబ్దుల్ని అవుట్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో.. కిందపడిన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అనంతరం తేరుకొని లేచి మళ్లీ అవుట్చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడలేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కప్ పేరిట వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల, జిల్లా , రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి ఈ జూన్ 2నాటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని.. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.