తెలంగాణ

telangana

MLA Raja Sing Refuses To Oath in Assembly

ETV Bharat / videos

ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను : రాజా సింగ్ - బీజేీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 8:16 PM IST

MLA Raja Singh Refuses To Oath in Assembly : ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఒవైసీ ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోనని గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ స్పష్టం చేశారు. తాను బతికున్నంత వరకు ఎంఐఎం సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు. 2018లో కూడా ఇలానే ఎంఐఎం ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్​గా నియమించారని, అప్పుడు కూడా తాను ప్రమాణస్వీకారం చేయలేదని గుర్తు చేశారు.

BJP MLA Raja Singh on MIM Party : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని ఒక మాట అడగాలని అనుకుంటున్న అంటూ మీరు కూడా కేసీఆర్​ అడుగుజాడల్లోనే వెళ్లాలని అనుకుంటున్నారా అంటూ రాజాసింగ్​ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఏర్పాటు చేశాక వాళ్ల కారు స్టీరింగ్​ను ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టి తప్పు చేశారన్నారు. ఎంఐఎం పార్టీ వారి ముందు ప్రమాణస్వీకారం చేయాలా అంటూ, ఎవరైతే సీనియర్​ నాయకులు ఉంటారో వారికే స్పీకర్​గా నియమించవచ్చు కదా ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details