తెలంగాణ

telangana

Rajasingh

ETV Bharat / videos

Rajasingh on Party Change Rumors : బీఆర్ఎస్‌లోకి రాజాసింగ్..? ఆయన ఏమన్నారంటే.. - Raja Singh meeting Harish Rao

By

Published : Jul 14, 2023, 3:34 PM IST

Rajasingh Clarity on Party Change Rumors : బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానంటూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తాను బీజేపీని వదిలి ఏ పార్టీలోకి వెళ్లనని ఆయన పునురుద్ఘాటించారు. ధూల్‌పేట ఆసుపత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిశానని చెప్పారు. హరీశ్‌రావు పిలిస్తేనే వారి ఇంటికి వెళ్లి అక్కడి సమస్యలు వివరించానని వెల్లడించారు. ధూల్‌పేట ప్రభుత్వాసుపత్రిని మోడల్‌ ఆసుపత్రిగా చేయాలని మంత్రిని కోరానని పేర్కొన్నారు. తాను కమలం పార్టీలోనే ఉంటానని.. ఇందులోనే మరణిస్తానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం వేటు వేసిన విషయం తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details