MLA Raja Singh Comments on Fake Votes : 'బీఆర్ఎస్-ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి' - రాజాసింగ్ కామెంట్స్ ఆన్ ఫేక్ ఓట్స్
Published : Sep 19, 2023, 3:50 PM IST
MLA Raja Singh Interesting Comments on Fake Votes in Telangana: రాష్ట్రంలోని ఓట్ల విషయంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్- ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఒక్కో నియోజక వర్గంలో 70 వేల బోగస్ ఓట్లకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఒక సెగ్మంట్ ఓట్లు మరో సెగ్మెంట్లోకి వెళ్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో తెలంగాణలో ఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక - మహారాష్ట్ర వ్యక్తుల ఓట్లు రాష్ట్రంలో నమోదవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా దొంగ ఓట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ సెగ్మెంట్లో ఓట్లు తగ్గుతున్నాయని.. మిగతా సెగ్మెంట్లలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
MLA Raja Singh Fire on KTR : రజాకార్ సినిమా టీజర్(Razakar Movie Teaser)కు భయపడి నిజాం వారసులు ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ట్విటర్ మెన్ కేటీఆర్ సెన్సార్ బోర్డ్‌కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకి చెప్పలేదా అని కేటిఆర్ని ప్రశ్నించారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రజాకార్ సినిమా కలిసి చూద్దామని మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ఆహ్వానించారు.