తెలంగాణ

telangana

MLA Raghunandan Rao

ETV Bharat / videos

MLA Raghunandan Rao Complaint to EC : 'వారిపై చర్యలు తీసుకోకపోతే దిల్లీ వెళ్లి ఈసీని కలుస్తాం'

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 5:12 PM IST

MLA Raghunandan Rao Complaint to EC : రాష్ట్ర పోలీసులకు ప్రతిపక్ష నేతల ఎమ్మెల్యేలు కనిపించడం లేదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఇవాళ ఉదయం సర్క్యులర్ ఇచ్చారని ఆయన ఆక్షేపించారు. బీజపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కారా..? అని ప్రశ్నించినా ఆయన.. తనకు భద్రత పెంచాలని రెండు నెలల క్రితం డీజీపీకి  వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. గులాబీ జెండా ఉన్నవాళ్లు మాత్రమే ఎమ్మెల్యేలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికార పార్టీ ఏజెంట్లుగా పని చేస్తున్న సిద్దిపేట పోలీసు అధికారులు.. గతంలో తాము వ్యక్తం చేసిన అనుమానాలను సిద్దిపేట పోలీసులు నిజం చేస్తున్నారని రఘునందన్​రావు ఆరోపించారు.  

Raghunandan Rao Fires on Telangana Police : కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీపై దాడిని తాము ఖండించాక.. బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై బీఆర్ఎస్ దాడులకు పాల్పడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. కాంగ్రెస్ వారు దాడి చేశారని సీఎం కేసీఆర్ సహా అందరూ చెబితే దుబ్బాక బీఆర్ఎస్ నేతలు మాత్రం రఘునందన్​రావు దాడి చేయించారని బంద్​కు పిలుపు ఇచ్చారని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బంద్ పోస్టర్లు వేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. కేవలం బీజేపీని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారన్న ఆయన.. తన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఎందుకు కేసులు నమోదు చేయరని నిలదీశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోపోతే దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్​ను కలుస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details