MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది' - ఎమ్మెల్యే మైనంపల్లి అసంతృప్తి
MLA Mynampally Latest Comments : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వేళ కొందరు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ జాబితాలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే చేరారు. ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చినా తన కుమారుడికి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. తిరుపతి దర్శనానికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తిని మరోసారి బయట పెట్టారు.
MLA Mynampally on MLA Tickets 2023 :తన కుమారుడు రోహిత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్ టికెటు ఇస్తే గెలిపించుకొని వస్తానని మైనంపల్లి అన్నారు. సోమవారం రోజున తన వ్యక్తిగత అభిప్రాయాలు స్వామివారి సన్నిధిలో చెప్పుకున్నానని తెలిపారు. ఇవాళ మరోసారి తన కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి చెప్పారు. తన కుమారుడి రాజకీయ భవిష్యతే తనకు ముఖ్యమని తెలిపారు. స్వామివారి సన్నిధిలో మొదటి సారిగా రాజకీయాలు మాట్లాడానని.. తన జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే కచ్చితంగా బదులు ఇస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ గూరించి మాట్లాడలేదని.. మెదక్ నియోజకవర్గ కార్యకర్తలు, మల్కాజ్గిరి కార్యకర్తలే తనకు ప్రాధాన్యమని వెల్లడించారు. తాను ఏ పార్టీని విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానని వివరించారు.