తెలంగాణ

telangana

Muthireddy Yadagiri Reddy

ETV Bharat / videos

MLA Muthireddy on Retired MPDO Murder : విశ్రాంత ఎంపీడీవో హత్య..! ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్​ ఇదే - Telangana crime news

By

Published : Jun 18, 2023, 1:37 PM IST

MLA Muthireddy Yadagiri Reddy Reacted on Retired MPDO Murder : జనగామ జిల్లాలో దారుణ హత్యకు గురైన విశ్రాంత ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, హత్య వెనుక ఎంతటి పెద్దవారైనా, ఏ పార్టీ వారు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్, జనగామ డీసీపీలకు విజ్ఞప్తి చేశారు. జనగామ కౌన్సిలర్ నరేందర్ తండ్రి అనారోగ్యానికి గురి కాగా పరామర్శించేందుకు ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ టీవీ చూస్తుండగా నల్లా రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడన్న వార్త మనసును కలచి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనక ఎంతటి పెద్దవారు, ఏ పార్టీ నాయకుల హస్తమున్నా పోలీసులు క్షుణ్నంగా దర్యాప్తు చేసి, హత్యలో పాల్గొన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం కిడ్నాప్​న​కు గురైన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య మృతదేహం జనగామ మండలంలోని చంపక్​హిల్స్ అటవీ ప్రాంతంలోని క్రషర్​ నీటి గుంటలో లభ్యమైన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details