ఫార్మా సిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండగ : మల్‌రెడ్డి రంగారెడ్డి - మల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు
Published : Dec 15, 2023, 4:43 PM IST
MLA Malreddy on PharmaCity Cancellation : ఫార్మా సిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండగని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఫార్మా సిటీ ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేయబోతున్నారని తెలిపారు. ఏదీ ఏమైనా ఫార్మసిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌కు ఆయన ధన్యవాదలు తెలిపారు.
ప్రజల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రజల అవసరాల కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. ఫార్మా సిటీ ఉంటే 2 వందల కిలోమీటర్ల మేర కాలుష్యం అయ్యేదని దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా హాని కలిగేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తుమన్నారు. మిగతా 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. అన్నదాత సంక్షేమం కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.