IFTAR Party: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న హోం మంత్రి - Iftar dinner on MLA Madhavaram Krishna Rao
IFTAR Party: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్లాపూర్ డివిజన్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజల అదృష్టం కేసీఆర్ లాంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా దొరికారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని పేర్కొన్నారు. కృష్ణారావు గతం కంటే రెట్టింపు మెజార్టీతో గెలుపొందడం ఖాయమని వివరించారు. ముస్లిం మైనారిటీ కుటుంబాల మద్దతు ఎప్పటిలాగే ఈసారీ కూడా బీఆర్‌ఎస్ పార్టీకీ ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని హోం మంత్రి వివరించారు. రంజాన్ పవిత్ర మాసం సందర్బంగా ముస్లీం కుటుంబీకులందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలనీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కార్పొరేటర్లు సబీహా గౌసుద్దీన్, ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.