Shejal Latest Comments : 'టార్చర్ చేస్తున్నారని చెప్పినా.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం లేదు' - origin dairy shejal sensational allegations
🎬 Watch Now: Feature Video
Shejal Latest Comments : గత కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని బొడపాటి శేజల్ అనే యువతి పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేస్తామని చెప్పిన తెలంగాణ పోలీస్ అధికారులు ఇప్పుడు వారి బాధ్యత విస్మరించారని ఆరోపించారు. గత మూడు రోజులుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు. రోజూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని.. కనీసం తన ఫిర్యాదు కూడా స్వీకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రుజువులు కావాలని.. పై అధికారులను సంప్రదించాకే కేసు నమోదు చేస్తామని కాలయాపన చేస్తున్నారని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కేంద్ర మహిళా కమిషన్కు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశానని శేజల్ చెప్పారు. కమిషన్ అధికారులు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని వెల్లడించారు. కమిషన్ ఆదేశించినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అన్నారు. 72 గంటలుగా తనను, తన కుటుంబాన్ని ఎమ్మెల్యే అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శేజల్ కంటతడి పెట్టారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తనకు న్యాయం జరగదని తెలిసే ఆత్మహత్యాయత్నం చేశానని.. అనవసరంగా ఆస్పత్రికి తీసుకువెళ్లి బతికించారని వాపోయారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమున్నీరయ్యారు.