తెలంగాణ

telangana

కళాకారులతో కలిసి ఎమ్మెల్యేల జోష్​ఫుల్ డాన్స్​లు

ETV Bharat / videos

MLA's Dance: ప్లీనరీ సమావేశాల్లో తొడగొట్టిన రాజయ్య, డ్యాన్స్ చేసిన గండ్ర - telangana latest news

By

Published : Apr 25, 2023, 7:35 PM IST

mla dance at brs plenary meetings: తెలంగాణలో బీఆర్​ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ భేటీల్లో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేతలు ఆటపాటలాడి ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డిలు కళాకారులతో కలిసి డాన్సు చేశారు. దీంతో సమావేశ ప్రాంతమంతా సందడిగా మారింది. కొత్త జోష్​తో ప్లీనరీ సమావేశాలు జరిగాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డాన్స్ వేశారు. కళాకారులతో కలిసి స్టేజిపై రాజయ్య తొడగొట్టి డాన్స్ చేయడంతో ఆ ప్రాంతంలో నూతనోత్సహాన్ని నింపింది. ఎమ్మెల్యే డాన్స్ చేయడంతో కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా చూశారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్​ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో కళాకారుల పాటలకు జెండా పట్టుకొని ఎమ్మెల్యే దంపతులు గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి రెడ్డి డ్యాన్స్ వేశారు. ఎమ్మెల్యే సభలో ఆనందంగా డ్యాన్స్ వేయడంతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉత్సాహంగా మారింది. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details