Mission Bhagiratha pipeline leakage in Lingapur : పైప్‌లైన్ లీకేజీతో.. మిషన్‌భగీరథ ఉప్పొం'గంగ' - నిజామాబాద్ జిల్లా వార్తలు
Mission Bhagiratha pipeline leakage in Lingapur : రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్‌భగీరథకు తరచూ లీకేజీలు సంభవిస్తున్నాయి. పైపుల నాణ్యతలో లోపమో లేదా ఆకతాయిల పనో పెద్దమొత్తంలో నీరు వృథా అవుతోంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ అయి పెద్ద మొత్తంలో నీరు బయటకు పోతోంది. పైప్‌లైన్ నుంచి వచ్చే నీరు ప్రెషర్ వల్ల ఆకాశానికి తాకే విధంగా ఎగసిపడుతోంది. కొన్ని వేల లీటర్ల నీరు పక్కనున్న పంట పొలాల్లోకి వెళ్తోంది. వేంటనే స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఇందల్వాయి మండలంలోనే పలు చోట్ల మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు జరిగాయి. దీంతో ఎగువనున్న ప్రాంతాలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. పంట కోసే సమయంలో పైప్‌లైన్ లీకేజీ వల్ల నీరు చేనులోకి నీరు పోవడంతో.. పంట కోతలకు ఇబ్బంది అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.