మిర్యాలగూడలో మిషన్ భగీరథ ఫౌంటెన్..! - Telangana news
Mission Bhagiratha Pipeline burst: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం వద్ద మిషన్ భగీరథ పైపు పగిలి కృష్ణా జలాలు వృధాగా పోతున్నాయి. మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం వద్ద మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ఉంది. అక్కడి నుండి మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజక వర్గాలకు కృష్ణా జలాలు సరఫరా అవుతాయి. ఈ క్రమంలో కోదాడ-జడ్చర్ల హైవే నిర్మాణ పనులు జరుగుతుండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అవంతిపురం వద్ద మిషన్ భగీరథ పైపు పగిలి నీరు ఫౌంటన్గా ఎగజిమ్మాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి నీటి వృధాను అడ్డుకున్నారు.