పట్టపగలే మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. - యమునా నగర్ మహిళ కిడ్నాప్
జిమ్ నుంచి తిరిగి వస్తున్న ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ఆ మహిళ కారులో నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎక్కారు. మహిళ ప్రతిఘటించడం వల్ల నిందితులు పారిపోయారు. ఈ ఘటన హరియాణాలోని యమునా నగర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ కారును పోలీస్ స్టేషన్కు తరలించి నిందితుల వేలి ముద్రలు సేకరించారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ కమల్దీప్ సింగ్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST