బోనాల పాటలకు అదిరే స్టెప్పులేసిన మంత్రి తలసాని.. మీరూ చూసేయండి.. - talasani srinivas yadav dance news
హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి తలసాని పోతురాజుల వేషధారణలో ఉన్న వారితో కలిసి కాలు కదిపారు. బోనాల పాటలకు స్టెప్పులు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి తలసాని కుటుంబసభ్యులు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST