నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదు : మంత్రి శ్రీధర్ బాబు - Sridharbabu latest news
Published : Jan 4, 2024, 2:09 PM IST
Minister Sridhar Babu Interview : తెలంగాణాలో తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండా తమ పరిపాలనపై బురద జల్లడం బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌కు సరికాదని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశించిన సమయంలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.
Sridhar Babu Comments On BRS : సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారందరికి ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.టికెట్లు త్యాగం చేసిన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వాలని హైకమాండ్‌ను కోరనున్నట్లు చెబుతున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.