తెలంగాణ

telangana

Minister Seethakka Released Water

ETV Bharat / videos

త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించేలా కృషి చేస్తాను : మంత్రి సీతక్క - నీరు విడుదల చేసిన సీతక్క

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 4:05 PM IST

Minister Seethakka Open Pump House Water : ములుగు జిల్లా రంగారావు పల్లి గ్రామ సమీపంలో ఉన్న పంప్​హౌస్​ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరిశీలించారు. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు గత ప్రభుత్వం నీరు తీసుకుపోయిందని ఆరోపించారు. రామప్ప రిజర్వాయర్(Ramappa Reservoir Water Release) ద్వారా పక్క నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తోందని అన్నారు. నీళ్లు ఇవ్వకుండా  రైతులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ ప్రాంత అన్నదాతలకు త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Minister Seethakka Released Water : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని కలిసి పంప్​హౌస్ నుంచి మిగతా మండలాలకు కూడా సాగు నీరు అందేలా కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. పంప్ హౌస్ వద్ద పాకాలకు పైపులైన్ జంగాలపల్లి చెరువులోకి కూడా నీరు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈరోజు అదే పంపును సీతక్క స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. ఈ పంపు కింద ములుగు మండలంలోని 1,300 ఎకరాలు, పాకాల 2,300 ఎకరాలు సాగవుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details