తెలంగాణ

telangana

Minister Seethakka Meeting with Officials for Prajapalana

ETV Bharat / videos

ప్రజల సమస్యలు గాలికి వదిలేసే అధికారులను ఇంటికి పంపిస్తాం : సీతక్క - అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:23 PM IST

Minister Seethakka Meeting with Officials for Prajapalana :మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత సీతక్క మొదటిసారిగా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ముందుగా మండలంలోని గిరిజనుల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం గుంజేడు క్రాసు నుంచి చిట్యాల గడ్డ తండా వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సీతక్కకు ఘన స్వాగతం పలికారు. రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

Minister Seethakka Warning to Officials about Prajapalana Negligence : అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు శాఖల అధికారులతో మాట్లాడి జరుగుతున్న పనుల సమస్యలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమానికి అధికారులంతా సమన్వయంతో మెలిగి, కలిసి పనిచేయాలని సకాలంలో దరఖాస్తుల స్వీకరణ జరగాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే తాము కూడా వారిపట్ల నిర్లక్ష్యం వహించాల్సి వస్తోందని హెచ్చరించారు. అలాగే మండలంలోని బక్క చింతలపల్లిలో చలిమంటల్లో పడిన చిన్నారిని పరామర్శించిన సీతక్క, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details