సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించేలా కృషి చేస్తా : మంత్రి సీతక్క - సావిత్రీ బాయ్ పూలే జయంతి
Published : Jan 3, 2024, 4:49 PM IST
Minister Seethakka in Savitribai Phule Jayanti: సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించేలా కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సంఘం మహిళా అధ్యక్షురాలు మని మంజిలీ, జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి సన్మానించారు. మహిళలు చదువుకునేందుకు తొలి అడుగు సావిత్రిబాయి ఫూలే వేశారని, తనలాంటి ఎంతో మందికి ఆమె ఆదర్శమయ్యారని పేర్కొన్నారు. కుల వివక్ష, అణచివేత నుంచి వచ్చిన వెలుగు రేఖ సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.
Seethakka Speech about Savitribai Phule :సమాజాన్ని సంస్కరించేందుకు చదువు, విజ్ఞానం కావాలని మంత్రి తెలిపారు. నేటి సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండటం బాధాకరమన్నారు. రాజకీయం అంటే తన దృష్టిలో సేవ మాత్రమేనని అన్నారు. సేవలో ఉన్న తృప్తి అజమాయిషీ చేయడంలో ఉండదన్నారు. ఆడవాళ్లు విద్యావంతులు అయినప్పుడే సమాజం బాగుంటుందని తెలిపారు. మంత్రి సీతక్క మరో అభినవ సావిత్రిబాయి ఫూలే అని జాజుల అన్నారు.