మహేశ్వరం ప్రజలు బీఆర్ఎస్కి మరోసారి ఓటువేసి ఆశీర్వదించాలి : సబితా ఇంద్రారెడ్డి - ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి సబిత
Published : Nov 2, 2023, 7:11 PM IST
Sabitha in BRS Election Campaign 2023 :బీఆర్ఎస్కి ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ చౌరస్తాలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారరథం ముందు కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ కార్పొరేషన్లోని లెనిన్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
BRS MLA Candiadate Sabitha in Election Campaign :ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. లెనిన్ నగర్లోని రోడ్లు వర్షాలకు నీరు నిలవకుండా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తమను దీవించాలని ప్రజలను అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని.. ఆడబిడ్డగా సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.