Minister Sabitha Give a Car Lift to the Children : చిన్నారులకు లిఫ్ట్ ఇచ్చిన చదువుల మంత్రి సబిత - టుడే రంగారెడ్డి వార్తలు
Published : Sep 20, 2023, 10:57 PM IST
Minister Sabitha Give a Car Lift to the Children :విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. మహేశ్వరం మండలం గొల్లురు నుంచి పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్తుండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడుగగా వెంటనే వారు సరే అనటంతో వారిని మంత్రి కారులోనే ఎక్కించుకున్నారు.
చాక్లెట్లు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గొల్లురు నుంచి తండా వరకు వారితో మాట్లాడుతూ మంత్రి బాగా చదివి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. గొల్లూరు నుంచి వారి ఊరి వరకు తీసుకెళ్లి ఇంటివద్ద దింపారు. చిన్నారుల బంధువులు ఎంతో ఆనందంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి రాకను గమనించిన స్థానిక వృద్ధురాలు కారు వద్దకు చేరుకొని.. సబితా ఇంద్రారెడ్డిని కలిసి.. ఎంతో ఆప్యాయంగా ముద్దాడింది.