Puvvada Fire on Tummala Nageshwararao : తుమ్మల వల్ల బీఆర్ఎస్కు ఒరిగిందేమీ లేదు : పువ్వాడ - కాంగ్రెస్‌పై పువ్వాడ అజయ్ ఫైర్
Published : Oct 16, 2023, 7:05 PM IST
Minister Puvvada Fire on Tummala Nageshwararao : తాను బీ-ఫాం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే.. ఖమ్మంలోకి కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారని పువ్వాడ అన్నారు. దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే సినిమా చూపించే వాడినని మంత్రి మండిపడ్డారు. ఖమ్మం ముస్తఫానగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ప్రతీ ఐదేళ్లకోసారి పార్టీ మారుతున్న ఓ మహానుభావుడు మళ్లీ ఖమ్మం వస్తున్నారని.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి పువ్వాడ ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికల్లో తుమ్మలను ఓడించి తీరుతానని పువ్వాడ విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిపించి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గులాబీ ఖిల్లాగా మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఒక్క టికెట్టు కోసం ఇండియా గేటు వద్ద పడిగాపులు కాస్తున్న నాయకులు.. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనీయమని ప్రగల్బాలు పలుకుతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.