Prashanthreddy: 'రేపు శుభసూచకంగా సీఎం కేసీఆర్ ఆ దస్త్రంపై సంతకంపై చేస్తారు' - మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాజా వార్తలు
Prashanthreddy Interview on New Secretariat Inauguration: తెలంగాణ పాలనలో కొత్త శకానికి ముహుర్తం సమీపిస్తోంది. శ్వేతసౌధంలా రాజసం ఉట్టిపడుతున్న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ ఘడియలు దగ్గరపడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. సాగర తీరాన ఠీవీగా నిలిచిన సమీకృత భవనం... చరిత్ర పుటల్లో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా రూపుదిద్దుకున్న భవనం... చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో మరో మకుటం కానుంది.
హిందూ, దక్కనీ.. కాకతీయ శైలిల కలబోతగా నిర్మాణమైన సువిశాల పాలనా సౌధం ప్రారంభోత్సవం రేపు వైభవంగా జరగనుంది. ఉదయం యాగంతోనే ప్రక్రియ మొదలవనుండగా... మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం చేరుకొని ప్రారంభోత్సవం చేయనున్నారు. శుభసూచకంగా ప్రజల కోణంలో దస్త్రంపై సీఎం సంతకం చేస్తారన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... మంత్రులందరూ అనుసరిస్తారని పేర్కొన్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు కొత్త సచివాలయం నుంచే జరుగుతాయన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డితో ఈటీవీ-భారత్ ముఖాముఖి చూద్దాం.