TS New Secretariat : తెలంగాణ రాజసం.. కొత్త పాలనాసౌధం
Telangana New Secretariat : చూపరులను ఇట్టే అకట్టునేలా వివిధ నిర్మాణశైలిల కలబోతగా.. భారీ భవంతిగా రాష్ట్ర నూతన పరిపాలనా సౌధం సిద్ధమైంది. ఆధునికతను అందిపుచ్చుకుంటూ.. సంస్కృతీ, సంప్రదాయలను మేళవించుకొన్న కొత్త సచివాలయం రాజదర్పాన్ని కళ్లకు కడుతోంది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పాలనా సౌధం.. దేశంలోని అతి ఎత్తైన భవనాల్లో ఒకటిగా నిలిచింది. పర్యావరణ హితంగా గ్రీన్ బిల్డింగ్‌గా గోల్డెన్ సర్టిఫికెట్ అందుకోబోతున్న నూతన సచివాలయం.. ఎన్నో ప్రత్యేకతల సమహారంతో, అందంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకొంది.
'నూతన సచివాలయం నిర్మించాలని అనుకొన్నప్పుడు అవుతుందా అనుకొనేవాళ్లం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని వెనుక ఉండి ధైర్యం ఇచ్చి నడిపించారు. సుమారు 100 గంటలు డిజైన్లు మీదే ఆలోచించాం.' అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ఆదివారం నాటి ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో సమీకృత సచివాలయ నిర్మాణ పనులను మొదట్నుంచీ పర్యవేక్షిస్తున్న రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.