న్యూ ఇయర్ వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ - మంత్రి పొన్నాం ప్రభాకర్
Published : Dec 31, 2023, 10:32 PM IST
Minister Ponnam Prabhakar Dance in New Year 2024 Celebration : రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసే ఘనంగా వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.
New Year 2024 Celebrations in Karimnagar Congress Office: కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మంత్రి ప్రభాకర్ స్టెప్పులు(Ponnam Prabhakar Dance) వేశారు. సరదాగా అందరితో పాటు డ్యాన్స్ చేస్తూ అలరించారు. పార్టీ శ్రేణులకు కేకు తినిపించారు. కార్యకర్తలందరూ ఆనందంగా ఈ వేడుకను చేసుకోవాలని అన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 2023 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బాయ్ బాయ్ చెప్తూ 2024 సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతం చెప్తుందని అన్నారు.