తెలంగాణ

telangana

Minister Malla Reddy Dance in Kukatpally

ETV Bharat / videos

Minister Mallareddy Dance in Kukatpally : మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్ - హైదరాబాద్ తాజా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 11:37 AM IST

Updated : Sep 30, 2023, 12:06 PM IST

Minister Mallareddy Dance in Kukatpally  :మంత్రి మల్లారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది.. పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అనే డైలాగ్. ఈ ఒక్కడైలాగ్​తో అంత వరకు రాజకీయ నేతల్లో పేరు పొందిన మల్లారెడ్డి.. ఒక్కసారిగా యూత్​లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు యూత్​కు మల్లారెడ్డి ఓ ఐకాన్​గా మారారు. డైలాగులతోనే కాదు వీలు కుదిరినప్పుడల్లా కాలుకదుపుతూ స్టెప్పులేయడం కూడా మల్లారెడ్డికి అలవాటు. 

Minister Mallareddy Dance Hyderabad : తాజాగా హైదరాబాద్​లోని కూకట్‌పల్లిలో డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ మంత్రి మల్లా రెడ్డి యువతలో జోష్ నింపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్‌పల్లిలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్​లో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేజ్​పై వైద్యులు, యువతతో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు.

పాలమ్మిన పూలమ్మిన అంటూ తన డైలాగ్ చెప్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలని చెప్పారు. తాను కూడా అదే చేస్తూ 70 ఏళ్ల వయస్సులో ఇంత ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. నేటి యువతలో కొందరు చెడు అలవాట్లకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అటువంటి వ్యసనాలను విడనాడి ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని సూచించారు.

Last Updated : Sep 30, 2023, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details