Minister Mallareddy Ganesh Chanda Viral Video : గణేశ్ చందా కోసం మంత్రి మల్లారెడ్డిని చుట్టుముట్టిన పిల్లలు.. వీడియో వైరల్ - Hyderabad latest news
Published : Sep 18, 2023, 6:37 PM IST
Minister Mallareddy Ganesh Chanda Viral Video : పాలమ్మినా.. పూలమ్మిన్నా.. కష్టపడ్డా.. పైకచ్చినా అంటూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కొందరు చిన్నారులు చుట్టుముట్టారు. తమ హక్కులు, డిమాండ్ల కోసం కాదు.. వినాయక చవితి చందా కోసం. పిల్లలు అడిగిన తీరుకు మంత్రి మొదట విస్తుపోయినా.. వెంటనే జేబులో ఉన్న రూ.5 వందల నోట్లు తీసి తలో నోటు పంచారు. అంతేకాదు.. తాను ఇచ్చిన డబ్బులు దేవుడికే వాడాలని, సొంతంగా వాడుకోవద్దని మల్లారెడ్డి సూచించారు.
దీంతో పిల్లలంతా వినాయకునికే డబ్బులు వాడుతామని చెప్పి.. జై మల్లన్న అంటూ జై కొట్టారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా తనదైన శైలి చూపిస్తుంటారు. అందుకే మల్లారెడ్డి మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తన, నడవడిక జనాలకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి.