తెలంగాణ

telangana

Minister KTR Vemulawada Tour Today

ETV Bharat / videos

Minister KTR Vemulawada Tour Today : ఆగేదే లే.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో వేములవాడలో బిజీబిజీగా గడిపిన కేటీఆర్ - రాజన్న సిరిసిల్ల తాజా వార్తలు

By

Published : Aug 8, 2023, 6:47 PM IST

Minister KTR Vemulawada Tour Today : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించారు. తొలుత సిరిసిల్ల నుంచి వేములవాడ వెళ్లే రహదారిలో రూ.కోటీ 14 లక్షలతో నిర్మించిన నంది కమాన్​ను ఎమ్మెల్యే రమేశ్​ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం చింతల తండాలో నిర్మించిన 42 రెండు పడక గదులను ప్రారంభించి.. లబ్ధిదారులకు అందజేశారు. ఆ తర్వాత జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రంతో పాటు మాతృ సేవా సంస్థను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఆసుపత్రిలో సదుపాయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్​ను, మూలవాగు వద్ద రూ.కోటీ 98 లక్షలతో నిర్మించిన బండ్ పార్కు ప్రాజెక్టును ప్రారంభించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తుల కోసం 100 గదుల నిర్మాణంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్యామ కుంట జంక్షన్ వద్ద వెజ్ మార్కెట్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. అనంతరం గుడి చెరువులో శివార్చన్న స్టేజికి శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details