KTR Plays Badminton : బ్యాడ్మింటన్ ఆడిన కేటీఆర్.. వీడియో వైరల్..! - హుస్నాబాద్‌లో కేటీఆర్ ఇండోర్ స్టేడియం ప్రారంభం
KTR Plays Badminton in Husnabad: హుస్నాబాద్ నియోజకవర్గంలో కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్‌తో బ్యాడ్మింటన్ ఆడారు.
హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. మొత్తం విలువు రూ. 27.51 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ సెంటర్, బస్తీ దవాఖానా, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే రూ.3.50 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
ప్రారంభోత్సవాల అనంతరం.. స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ప్రజాగర్జన సభగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. తొలిసారి హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చిన కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.