KTR Praises driverless tractor : డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతున్న ట్రాక్టర్ - Kits developed driverless tractor
Warangal kits made driverless tractor : డ్రైవర్‌లెస్ అటానమస్ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసిన వరంగల్ కిట్స్ బృందాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌తో కిట్స్ బృందం ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్లో వీడియోను పోస్టు చేశారు. ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్‌లో వ్యవసాయం, సామాజిక ప్రభావం చూపాలనుకునే యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్ని ఆలోచనలు, ఉత్పత్తులతో బయటకు రావాలని కేటీఆర్ కోరారు. సామాజిక మేలు కోసం మంచి ఆవిష్కరణలు ఆవిష్కరించండి అంటూ ట్విటర్లో యువతకు సూచించారు. టీహబ్, టీవర్క్స్, వీహబ్, రిచ్ హైదరాబాద్, టీం టీఎస్‌ఐసీ వంటి సంస్థలు యువతకు సహాయం చేయడానికి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
కిట్స్ అభివృద్ధి చేసిన ట్రాక్టర్ రైతులను మరింత ఆకట్టుకొంటుంది. డ్రైవర్ అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ఆ ట్రాక్టర్‌ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ట్రాక్టర్లతో తమ పొలం పనులను తామే స్వంతంగా చేసుకొవచ్చునని అంటున్నారు. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.