తెలంగాణ

telangana

Konda Surekha visited Sri Mallikarjuna Swami At Inavolu

ETV Bharat / videos

ఐనవోలు మల్లన్న జాతర ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి కొండా సురేఖ - Konda Surekha At Inavolu

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 5:57 PM IST

Minister Konda Surekha Visits Inavolu Temple Today : రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరలు కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరల నిర్వహణ చేస్తుందని చెప్పారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Konda Surekha Review Of Inavolu Mallanna Brahmotsavam : స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కొండా సురేఖ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణపై  సమీక్ష సమావేశం నిర్వహించారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేేఖ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details