తెలంగాణ

telangana

Minister Jagadish Reddy

ETV Bharat / videos

Minister Jagadish Reddy Fires on Governor Tamilisai : 'గవర్నర్ తమిళిసై చెప్పే లెక్క ఆమెకు కూడా వర్తిస్తుంది' - గవర్నర్ నిర్ణయంపై జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలు

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 10:02 PM IST

Minister Jagadish Reddy Fires on Governor Tamilisai :ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) చెబుతున్న సాకులు గురువింద సామేతను గుర్తుకు తెస్తున్నాయని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మాట్లాడిన మంత్రి(Jagadish Reddy).. ఎమ్మెల్సీల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్న గవర్నర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. 

Jagadish Reddy Comments on Governor Decision : గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీకి అధ్యకురాలుగా ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. గవర్నర్ పదవి ప్రకటన తర్వాత పార్టీ పదవికి రాజీనామా చేసి గవర్నర్ అయిన తమిళిసై నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటా అనడం అర్ధరహితం అన్నారు. బీజేపీ(BJP) నుంచి గవర్నర్​గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకు కూడా వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details