12 సార్లు మీరు కాంగ్రెస్‌ను గెలిపించారు కానీ వారు ఇక్కడ చేసిందేమిలేదు : హరీశ్‌రావు - జరీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌రావు
Published : Nov 16, 2023, 3:32 PM IST
Minister Harish Rap Slams Congress Party : 12 సార్లు గెలిపించిన జహీరాబాద్‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కర్ణాటకలో హామీలను ఎందుకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అక్కడ అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తాం అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు కింద ఎకరాకు రూ.16వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం 2గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు.
'జనవరి నుంచి అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. అరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచబోతున్నాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకి రూ. 3వేలు ఇస్తాం. రైతు రుణమాఫీ పూర్తయింది.. ఈసీ అనుమతి రాగానే అందిస్తాం.' అని హరీశ్‌రావు అన్నారు.