Minister Harish Rao Reacts on Raithu Bandhu : "కాంగ్రెస్ వచ్చిందంటే.. పథకాలకు ఇక రాంరాం"
Published : Oct 26, 2023, 4:21 PM IST
|Updated : Oct 26, 2023, 4:39 PM IST
Minister Harish Rao Reacts on Raithu Bandhu : రైతుబంధు పథకం.. ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయని రైతుబంధు నిధులు ఇవ్వొద్దని.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. కాంగ్రెస్ వచ్చిందంటే రైతు పథకాలకు ఇక రాంరాం చెబుతారని అని ఎద్దేవా చేశారు. రైతులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ రైతులపై కోపం పెంచుకుందని ధ్వజమెత్తారు.
Congress Complaints EC on Raithu Bandhu Funds : కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు రైతులు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో హయాంలో.. రాష్ట్రంలో రోజూ రైతుల ఆత్మహత్యలు ఉండేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... రైతుబంధు ఉండదని, మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయన్నారు. తెలంగాణ రైతుబంధునే కేంద్రంలో మోదీ సర్కార్ కాపీ కొట్టిందని తెలిపారు. తెలంగాణలోని చాలా పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, అధికారుల జీతాల్లో కోత పెట్టి రైతుబంధు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే... రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.