గోదావరి నీళ్లతో గజ్వేల్ ప్రజల కాళ్లు కడిగిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి హరీశ్‌రావు - బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం 2023
Published : Nov 17, 2023, 5:28 PM IST
Minister Harish Rao Election Campaign at Gajwel :గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి.. ఇతర పార్టీ వాళ్లు ఇన్ని రోజులు కనిపించారా అని మంత్రి హరీశ్‌రావు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గజ్వేల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హారిశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో కూడా తిరిగింది గులాబీ పార్టీ నాయకులే అని గుర్తు చేశారు. కేసీఆర్ గజ్వేల్‌కు వచ్చాక ఇక్కడి భూముల విలువతో పాటు మనుషుల విలువలు కూడా పెరిగిపోయాయి అని అన్నారు. కొందరు ఎన్నికల ప్రచారంలో ఘాటు మాటలు మాట్లాడుతున్నారని.. వారి మాటలు విని మోసపోవద్దని సూచించారు.
గోదావరి నీళ్లతో గజ్వేల్ ప్రజల కాళ్లు కడిగిన ఘనత కేసీఆర్‌దేనని హరీశ్‌రావు అన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ వస్తాదని.. అది కూడా 30 సార్లు వస్తదని ఆ ప్రాంత ప్రజలే అంటున్నారని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు ఓటు వేయండి, 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు వేయండి అంటూ మంత్రి ప్రజలకు వివరించారు. రైతు బంధు దండగ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. ముచ్చటగా మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.