తెలంగాణ

telangana

Harish Rao

ETV Bharat / videos

Harish Rao: వికలాంగులకు రూ.3016 పెన్షన్​ వచ్చే.. స్కూటీని తెచ్చే - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు

By

Published : Apr 23, 2023, 4:31 PM IST

Harish Rao Distributed Honda Scooties To Disabled: దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు రూ.3016 పెన్షన్ ఇస్తున్నామని, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో రూ.900, రూ.1000 మాత్రమే ఇస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 50 మంది వికలాంగులకు హోండా స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడిన మంత్రి.. రూ.లక్ష 4 వేలు విలువ చేసే వాహనాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

వికలాంగులకు ఇలా 50 స్కూటీలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కూడా 21 మందికి ఇలాగే స్కూటీలను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు. వికలాంగుల కళ్లల్లో ఆనందం కోసమే ఈ స్కూటీలను అందజేయడం జరిగిందన్నారు. మొత్తం 71 వాహనాలు పంపిణీ చేశామని, వారికి ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇవాళ సీఎం కేసీఆర్ మాత్రమే వికలాంగులను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మోద్దని.. వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టలన్నాలని సూచించారు.   

ABOUT THE AUTHOR

...view details