బీజేపీకి పని తక్కువ ప్రచారమెక్కువ : మంత్రి హరీశ్ రావు - బీజీపీపై హరీశ్ రావు కామెంట్స్
minister Harish rao Comments on bjp : సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లో నిర్వహించిన కంటి వెలుగు వేడుకల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కంటి వెలుగు కింద 50 రోజుల్లో కోటి మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. పక్క రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్షాలు మెచ్చిన పథకం కంటి వెలుగు అని మంత్రి పేర్కొన్నారు. పేదవారికి సాయం చేయాలనే ఉద్దేశంతో... ఒక్కరోజు కూడా పథకం ఆగవద్దని 10 శాతం బఫర్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
దేశం మెచ్చిన పథకం మన కంటి వెలుగుని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశంలో తొలిసారి ప్రజల వద్దకు ఆస్పత్రులు వచ్చాయని వెల్లడించారు. కంటి వెలుగు కింద 50 రోజుల్లో కోటి మందికి పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కేసీఆర్ సేవలందించారని కొనియాడారు. బీజేపీది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వమని అభిప్రాయపడ్డారు. పని చేసి ప్రజల హృదయం గెలుచుకోమని కేసీఆర్ చెబుతుంటారని వివరించారు.